PS Telugu News
Epaper

శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్ల వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికం

📅 27 Feb 2026 ⏱️ 6:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

ఉయ్యూరివారిమెరక గ్రామంలో చంపాటి శివరామకృష్ణంరాజు ఇంటి వద్ద బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులు గెద్దాడ హరే రామ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్ మాట్లాడుతూ శాసనమండలిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ సభ్యుల అనుచితమైన ప్రవర్తన పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చ సమయంలో, సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసిపి సభ్యులు మైకు ఇవ్వకుండా అడ్డగించడం, భౌతిక దాడి చేసే విధంగా ప్రేరేపించడం, ఇది ప్రజాస్వామ్య సభ్యతకు, శాసనసభ ఆచారాలకు మచ్చగా నిలిచిందని అన్నారు. శాసన మండల చైర్మన్ సభను వాయిదా వేసారే కానీ వైసీపీ సభ్యులపై చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అసభ్య ప్రవర్తన చేసిన సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ మోర్చా డ్రైనేజీ సెల్ కన్వీనర్ చంపాటి శివరామకృష్ణంరాజు, అధ్యక్షులు పోతురాజు సురేష్, ప్రధాన కార్యదర్శి బోనం నాయుడు, ఉపాధ్యక్షులు ఉద్రరాజు రామకృష్ణంరాజు, రావూరి బాబ్జి, చంపాటి శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top