PS Telugu News
Epaper

శాసన మండలిలో సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీల దాడి యత్నం – ప్రజాస్వామ్యానికి మచ్చ: అయ్యాజీ వేమా

📅 27 Feb 2026 ⏱️ 6:08 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 27

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్, సీనియర్ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారిపై వైసీపీ సభ్యులు భౌతిక దాడి యత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర మచ్చగా మారిందని బీజేపీ నేత, మాజీ శాసన సభ్యుడు శ్రీ మానేపల్లి అయ్యాజీ వేమా ఆగ్రహం వ్యక్తం చేశారు.అంబేధ్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులడు చెల్లింగి త్రినాధరావు అధ్యక్షతన రాజోలు నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడిన అయ్యాజీ వేమా, “సభలో సీనియర్ సభ్యుడైన సోము వీర్రాజు గారిపై ఇలాంటి అసభ్యకర భౌతిక దాడి ప్రయత్నం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ప్రశ్నించే గొంతును అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు.ప్రజాస్వామ్యం ఇలాంటి చర్యలను ఎన్నటికీ ఊరుకోదు” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.హోంమంత్రి శ్రీమతి అనిత, మహిళా మంత్రులు ఉన్నప్పటికీ వైసీపీ సభ్యులు గౌరవం లేకుండా ప్రవర్తించారని, సభా సభ్యతా సంస్కారాలను పూర్తిగా ఉల్లంఘించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో వడ్లమూడి ప్రకాష్, దేవల మాణిక్యాలరావు, జొన్నలగడ్డ గోపాలకృష్ణ, నార్కెట్ మిల్లి బాలకృష్ణ, పాటిబల్ల అప్పాజీ తదితర బీజేపీ నాయకులు పాల్గొని ఘటనను ఖండించారు.బీజేపీ నేతలు శాసన సభలో అసభ్య ప్రవర్తనకు వ్యతిరేకంగా తమ నిరసనను తీవ్రంగా నమోదు చేస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని డిమాండ్ చేశారు.

Scroll to Top