PS Telugu News
Epaper

శిక్షణ తరగతుల ను పరిశీలించిన…సీఎంఓ

📅 07 Feb 2026 ⏱️ 6:58 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 7 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మండల విద్యాధికారి 2 సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యాంజలి 2.0 ఒక రోజు ఓరియెంటేషన్ శిక్షణా తరగతుల ను సర్వశిక్షా అభియాన్ అనంతపురం నుండి వచ్చిన కమ్యూనిటీ మొబలైజర్ (సీఎంఓ) చంద్రశేఖర్ నాయుడు పరిశీలించిన పిదప, శిక్షణా తరగతుల కు హాజరైన ప్రధానోపాధ్యాయుల తో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంగా చేపడుతున్న విద్యాంజలి 2.0 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల ల యందు చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల కు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పూర్వ విద్యార్థులు భాగస్వామి గా వారి గ్రామం లోని ప్రభుత్వపాఠశాల అభివృద్ధి కి తమ వంతు కృషి చేసి ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధి కి కృషి చేయాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో మండల విద్యాధికారి 2 సీతారామాంజనేయులు,సీఎంఓ చంద్రశేఖర్ నాయుడు మండలము లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు

Scroll to Top