శివపార్వతుల విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నరాజంపేట పార్లమెంట్ టిడిపి ఇన్చార్జిచమర్తి జగన్ మోహన్ రాజు
పయనించే సూర్యుడు నవంబర్5 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లె మండలం
సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామపంచాయతీ కురవపల్లి గ్రామస్తుల ఆహ్వాన మేరకు హాజరైన రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శివ పార్వతుల విగ్రహ ప్రతిష్ట లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించడం జరిగినది. ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో శివపార్వతులను భక్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున శివపార్వతుల విగ్రహ ప్రతిష్ట లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సుండుపల్లె మండలం టిడిపి అధ్యక్షుడు కల్లేరెడ్డప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లెల శ్రీవాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు శివరాం నాయుడు, అక్షర స్కూల్ అధినేత దొంతం శివ, కమ్మ సంఘం అధ్యక్షుడు శివ నారాయణ చౌదరి, ప్రసాద్ రాజు, సింగల్ విండో ప్రెసిడెంట్ బెల్లాల రమణయ్య, ఆలయ చైర్మన్ చంద్రమోహన్, వెంకటరామరాజు, జయరాం రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ నాగమణి నాయక్, ఆమెని రాజన్న, చిన్న సిద్దయ్య, జనార్దన్ నాయుడు, నాగేశ్వరరావు ఈశ్వరయ్య, జనార్ధన ఆదర్శ రైతు అమృత నాయక్, రామాంజులు, ఓబుల్ నాయుడు, రఘునాథ నాయుడు, లక్ష్మీ నాయుడు, షేక్ ఫాతిమా, షేక్ జక్రియ, షేక్ ఇస్మాయిల్, శ్రీధర్, భాస్కర్ నాయుడు సిద్ధిక్,