పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 9(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి లోని కోటవీధి కి చెందిన ఉమామహేశ్వర్ ఆహ్వానం మేరకు వారి కుమార్తె వివాహ మహోత్సవం పప్పూరు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అశ్వర్థ నారాయణస్వామి వారి సన్నిధిన వి.ఎల్. ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్ నందు హాజరై నూతన వధూవరులు దివ్యశ్రీ, మల్లిఖార్జున, లను బాల రమేష్ బాబు ఆశీర్వదించారు. అలాగే యాడికి ఆర్యవైశ్య వీధిలోని గాధంశెట్టి రఘు ఆహ్వానం మేరకు వారి నూతన గృహప్రవేశ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్ బాబు రోశిరెడ్డి జూటూరు భాస్కర్ రెడ్డి, గాదంశెట్టి బలరామయ్య,కోడూరు సుబ్బారెడ్డి, బందెన్న స్వాములు, కొండారెడ్డి, ఆనంద్ రెడ్డి, మరాటి మధు తదితరులు పాల్గొన్నారు.


