శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్అప్పాల గణేష్ చక్రవర్తి

August 19, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : ఈ రోజు నిర్మల్ పట్టణంలోని బంగాల్పేట్ లో డబుల్ బెడ్‌రూమ్ ప్రాంతంలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గణపతి, శ్రీ శివుడు, శ్రీ అన్నపూర్ణదేవి, శ్రీ నందీశ్వరుడు, శ్రీ నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివార్ల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, నిర్మల్ పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్కాకుల హరీష్, గుంజాల చైతన్య, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య మరియు కాలనీ వాసులు రవి, ప్రకాష్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper