PS Telugu News
Epaper

శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి కల్యాణోత్సవం

📅 27 Jan 2026 ⏱️ 3:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం గ్రామంలో వేచి ఉన్న శ్రీ పార్వతికుండలేశ్వర స్వామి వారి &శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి (క్షేత్రపాలకు) వారు కళ్యాణ మహోత్సవములు.ది 28-1-2026 నుండి 2-2-2026 వరకూ.మొదటిరోజు 28-1-2026 బుధవారం సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజాది గవ్యాంత మార్జనలు, అస్త్రరాజార్చన, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ఆవరణ,మూర్తి, మూలమంత్ర హోమ కార్యక్రమాలు, ధ్వజారోహణం, ఆలయ బలిహరణ అనంతరం, గ్రామోత్సవం అనంతరం శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి మరియు క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం, తీర్థ ప్రసాద వితరణ…2వరోజు 29-1-2026 గురువారం నిత్యార్చనలు ఉదయం సాయంత్రం నిత్యౌపాశన బలిహరణలు.3 వరోజు 30-1-2026 శుక్రవారం నిత్యార్చనలు ఉదయం సాయంత్రం నిత్యౌ పాశన బలిహరణలు అనంతరం సాయంత్రం స్వామివారి సదస్యం. అనంతరం ప్రసాద వితరణ.4 వరోజు ది 31-1-2026 శనివారం ఉదయం సాయంత్రం నిత్యౌపాసన బలిహరణ అనంతరం చోరోత్సవకాల విశేష అర్చన. ప్రసాద వితరణ.5 వరోజు ది 1-2-2026 ఆదివారం “మాఘపౌర్ణమి ” మహాపర్వదినం ఉదయం నిత్యౌపాసన బలిహరణలు అనంతరం వృద్ధ గౌతమి నదీతీరమున త్రిశూలస్నాన, చక్రస్నాన మహోత్సవములు కార్యక్రమం.6వరోజు ది 2-2-2024 వతేది సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పార్వతీకుండలేశ్వర మరియూ శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల శ్రీ పుష్పయాగ మహోత్సవములు, అనంతరం వేద ఆశీర్వచనం ప్రసాదవితరణ…

Scroll to Top