PS Telugu News
Epaper

శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వార్ల పాంచాహన్ని క దివ్య కళ్యాణ మహోత్సవాలు.

📅 29 Jan 2026 ⏱️ 5:20 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 29 ముమ్మిడివరం ప్రతినిధి

భీష్మ ఏకాదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని కుండలేశ్వర క్షేత్రంలో ఈ రోజు లగాయతు అనగా జనవరి 28 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు శ్రీ కుండలేశ్వర స్వామి వారికి టీటీడీ వార్షిక సత్కార పండితులు బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరిపండు శివాచార్య వారి బ్రహ్మత్వం లో అర్చకులు డాక్టర్ కాళ్ళకూరి కామేశ్వరరావు నేతృత్వంలో పార్వతీ కుండలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు మరియు క్షేత్రపాలకుడైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నడవపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు గ్రంధి చిన సూర్యం వారి కుటుంబీకుల యాజమాన్యంలో శ్రీమాన్ పెద్దింటి విజయ సారధి లక్ష్మీప్రసాదాచార్యులు వారి బ్రహ్మత్వంలో శ్రీమాన్ సుదర్శనం కృష్ణ ప్రసాదాచార్యులు వారి నేతృత్వంలో ఆలయ కార్య నిర్వహణాధికారి వారైన శ్రీమతి కొర్లపాటి సూర్య వెంకట దుర్గ వారి పర్యవేక్షణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున కళ్యాణ ఏర్పాట్లు చేసి కళ్యాణాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసిరి…

Scroll to Top