శ్రీ విజయ దుర్గ అమ్మవారి తృతీయ వార్షికోత్సవం.
పయ నించే ఫిబ్రవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)
ముమ్మిడివరం మండలం కర్రీ వాని రేవు అగ్నికుల క్షత్రియ గ్రామంలో వేంచేసిఉన్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి మూడవ వార్షికోత్సవం అత్యంత వైభవంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ శ్రీకంఠం ప్రభాకర్ శర్మ బ్రహ్మత్వంలో గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్యం సకల దేవతా మండపారాధన అమ్మవారికి పంచామృత అభిషేకం సామూహిక కుంకుమార్చన గంగాదేవికి గోదావరి మాతకు విశేష కుంకుమార్చన నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ ఆలయంలో విశేష కార్యక్రమాలు పంచామృత అభిషేకము వలన శక్తి పెరిగి భక్తులు కోరుకున్న కోర్కెలు తీరుతాయి అన్నారు గుడి కేంద్రముగా వారం వారం భజన ప్రతి పౌర్ణమికి సామూహిక హారతి నెలకి ఒకసారి తెల్లవారుజామున నగర సంకీర్తన చేయడం వలన గ్రామం సుభిక్షంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో కర్రి అన్నవరం కర్రీ సుబ్బారావు కర్రీ కృష్ణారావు కర్రీ ధనుంజయ వర్మ ఓలేటి సూర్యారావు కాలాడి సత్యనారాయణ కర్రీ సత్యనారాయణ పోతాబత్తుల వీర వెంకట సత్యనారాయణ ఇల్లింగి తిరుపతిరాజు కర్రీ చిన్న సత్యనారాయణ కర్రీ కాసుబాబు పాలెపు రామకృష్ణ రేవు సింహాచలం మరియు మాతృమూర్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
