PS Telugu News
Epaper

శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 287 వ జయంతి ఉత్సవాలో పాల్గొన్న భైంసా మాజీ -మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు.

📅 21 Feb 2026 ⏱️ 2:11 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ఖానాపూర్ లో బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శకులు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు బంజార సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బంజార నాయకులు, సోదర సోదరీమణులు పాల్గొన్నారు.**ఈ సందర్భంగా భైంసా మాజీ-మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బాసరలో గోదావరి నది తీరాన 45 రోజులపాటు దీక్షలో కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అలాగే బాసరలో 5 ఎకరాల విస్తీర్ణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది బాసర్ లో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాలలో సందర్భంగా సీతక్క/ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీ విధంగా బాసర్ లో 5 ఎకరాల భూమిని మరియు గుడి నిర్మాణానికి 5 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు. జాదవ్ రాజేష్ బాబు భైంసా మాజీ-మార్కెట్ కమిటీ చైర్మన్ BJP రాష్ట్ర నాయకులు.

Scroll to Top