PS Telugu News
Epaper

శ్రీ సత్యానంద సరస్వతి స్వామీజీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామారావు పటేల్

📅 02 Mar 2026 ⏱️ 6:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

ఆధ్యాత్మికత, అభివృద్ధి సమాజానికి మార్గదర్శకం

లోకేశ్వరం మండలంలోని బ్రహ్మేశ్వర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి స్వామీజీ గారి 100వ శతజయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవార్ రామారావు పటేల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామీజీకి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం బాగాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులతో కలిసి పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధి, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top