పయనించే సూర్యుడు జనవరి 10 (గణేష్ టౌన్ రిపోర్టర్) వేములవాడ:
సంక్రాంతి పర్వదినం ని పురస్కరించుకొని శిశు మందిర్ వేములవాడ లో విద్యార్థుల కోలాటాలు, రంగవల్లులు, గాలిపటాల ఆటలతో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.పాఠశాల అధ్యక్షులు శ్రీ డాక్టర్ మనోహర్ మరియు సమితి కార్యదర్శి శ్రీ గర్శకుర్తి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాతాజీ లు, పిల్లల తో కలిసి ఏర్పాటు చేసిన సంక్రాంతి గ్రామీణ సాంప్రదాయ కళా రూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అలాగే మైదానం మొత్తం రంగు రంగుల ముగ్గులతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా మారింది.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటాలు, నృత్య ప్రదర్శనలు అలరించాయి.అనంతరం బాలురు గాలిపటాలను ఎంతో ఉత్సాహంగా ఎగురవేశారు.
మొత్తం గా ఈ రోజంతా పిల్లలు ఆనందోత్సాహాలతో పాఠశాలలో గడిపారు.
కాగా వేడుకలను ఉద్దేశించి పాఠశాల అధ్యక్షులు డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ “సంక్రాంతి అంటేనే సంబరాల నిలయం అని,ఈ పండుగను పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా ఈ సం-క్రాంతీ పండుగ జరుపుకుంటామని,ఈ సంక్రాంతి నుండి రాత్రి సమయం తగ్గి, పగలు సమయం పెరుగుతుందని అంటే చీకట్లు తగ్గి వెలుతుర్లు పెరుగుతాయని అలాగే మనందరి జీవితాల్లో కూడా విజయాలనే వెలుతురు రావాలని దాని కోసం బద్దకం అనే చీకటి ని పారద్రోలి చురుకుదనం అనే వెలుతురు ని పొందాలని విద్యార్థులకు సూచించారు”కాగా ఈ వేడుకల్లో పాఠశాల తల్లిదండ్రులు మరియు ఆచార్యులు మాతాజీలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని ప్రధానాచార్యులు చిలుక గట్టు తెలిపారు.