షాద్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు మార్చి 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని జానమ్మ చెరువు అభివృద్ధి పనులకు షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. అమృత్ స్కీమ్ లో భాగంగా 1 కోటి రూపాయలతో జానమ్మ చెరువు కట్ట మరమ్మత్తులు, వాకింగ్ ట్రాక్ తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు అవసరమైన నిధులను కేటాయించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించి, అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు.
