సంక్రాంతికి మెగాస్టార్ సినిమా విడుదల సందర్భంగా ముగ్గుల పోటీలు
పయనించే సూర్యుడు జనవరి 6,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
మెగాస్టార్ సినిమా విడుదలకు రంగురంగుల ముగ్గులు
నంద్యాల జిల్లా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి నటించిన “వరప్రసాద్ వస్తున్నాడు” సినిమా విడుదల సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమాన సంఘం మరియు బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఈ నెల 10వ తేదీన ఈ ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోటీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ పోటీలకు తెలుగింటి ఆడపడుచులు ఎవరైనా పాల్గొనవచ్చని, ఇందుకోసం ఈ నెల 8వ తేదీలోపు నిర్వాహకులు అందించిన 9160654801 నంబర్‌కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే పోటీల్లో పాల్గొనే అర్హత ఉంటుందని ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ పోటీలో 1, 2, 3 బహుమతులతోపాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి (100 మంది కి) సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న “వరప్రసాద్ వస్తున్నాడు” సినిమా టికెట్లను వంద మంది మహిళలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చిరంజీవి ఫ్యాన్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో విశ్వనాథ్, సుధీర్, పసుపులేటి ప్రసాద్, రెడ్ రోజ్ కృష్ణ, శివ, ప్రశాంతి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.