PS Telugu News
Epaper

సంక్షేమ పథకాల అమలుపై అవగాహన

📅 18 Feb 2026 ⏱️ 7:19 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి17 ముమ్మిడివరం ప్రతినిధి: గ్రంధి నానాజీ

ప్రభుత్వ శాఖల సమన్వయం, స్వచ్ఛంద సంస్థల కృషి ద్వారా మాత్రమే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందుతాయని కాట్రేనికోన తహసిల్దార్ రవి కిరణ్ అన్నారు. స్థానిక సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాసిల్దార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మన పిల్లల బాధ్యత మనపైనే ఉంది కావున వారికి స్వేచ్ఛను ఇస్తూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు దూరంగా పిల్లలను ఉంచాలని మరో అతిధి ఎస్. ఐ అవినాష్ అన్నారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, అలర్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కాట్రేనికోన మండల పరిధిలో బత్తిన సుబ్బారావు గ్రామంలో స్వచ్ఛంద సంస్థల రాష్ట్ర కోఆర్డినేటర్శీల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు-సాధికారిత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, పిల్లలు, కౌమార బాలికలు,గర్భిణీ స్త్రీలు, పేదకుటుంబాలకు సంబంధించి అమలులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. బలహీన కుటుంబాల సంక్షేమం కొరకు నిరంతరం స్వచ్ఛంద సంస్థలు పని చేస్తాయని, ఈ తరహా సమన్వయ సమావేశాలు క్షేత్రస్థాయిలో ఘననీయమైన మార్పులు తీసుకువస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అలర్ట్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, జిల్లా కోఆర్డినేటర్ కె. వెంకటేశ్వరరావు, అలర్ట్ కమ్యూనిటీ సోషల్ వర్కర్ తులసి, కె. అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top