PS Telugu News
Epaper

సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు షాక్ — కోట్లు ఖర్చు చేశారా?

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ;స్టార్‌ హీరోయిన్‌ సమంత, బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజ్‌నిడుమోరు సోమవారం భూతశుద్ధి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి ఫోటోలను స్వయంగా సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి బాగా వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో సమంత ధరించిన కాస్ట్యూమ్ తోపాటు ఆమె వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకతను తాజాగా ఓ జ్యువెలరీ వ్యాపారి బయటపెట్టారు. ఈ ఉంగరానికి చాలా పెద్ద చరిత్రే ఉందని వివరించారు. మొఘలుల కాలంలో తొలిసారి ఈ రకమైన డిజైన్ తో ఉంగరం తయారుచేశారని పేర్కొన్నారు. పోట్రెయిట్ కట్ గా పిలిచే ఈ డిజైన్ ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ భార్య ముంతాజ్‌ కు ఈ డిజైన్ ఉంగరాలంటే చాలా ఇష్టమని చరిత్రకారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోట్రెయిట్ కట్ రింగ్ తయారీ కోసం వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్‌ చేసి పలుచని గాజు పలకలా తయారుచేస్తారని జ్యువెలరీ వ్యాపారి చెప్పారు. ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారుచేస్తారని పేర్కొన్నారు. సమంత వెడ్డింగ్ రింగ్ సుమారు రూ.1.5 కోట్లు విలువ చేస్తుందని తెలిపారు.

Scroll to Top