సరైన భద్రత ప్రమాణాలు ఫిట్నెస్ లు లేని వోల్వా బస్సులు సీజ్
పయనించే సూర్యుడు ఏప్రిల్ ఒకటి (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారిపై సరైన సుమారు 10 నుంచి 11 గంటల మధ్యలో అనుమతులు మరియు భద్రత ప్రమాణాల పాటించని వోల్వో బస్సులపై ఎంవిఐ అధికారుల కొరడా.డిప్యూటీ కమిషనర్ రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలో భాగంగా సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు పాటించని నాలుగు వోల్వా బస్సులను సీజ్ చేసి ఆర్టీసీ డిపోకు తరలించిన ఎంబీఐ అధికారులు.వివరాల్లోకి వెళితే శ్రీ సిటీ పారిశ్రామిక వాడ నుంచి బెంగళూరు హైదరాబాదు మరియు వైజాగ్ వాణిజ్య నగరాలకు ప్రయాణికులతో మంగళవారం రాత్రి ప్రయాణికులతో బయలుదేరిన వోల్వ బస్సులను డిప్యూటీ కమిషనర్ రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు సూళ్లూరుపేట ఎంవిఐ అనిల్ కుమార్ మరియు గూడూరు ఎంవిఐ తిరుమల రావు సంయుక్తంగా సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా ప్రయాణికులకు సరైన సౌకర్యాలు మరియు భద్రత ప్రమాణాలు కల్పించని నాలుగు వోల్వ బస్సులను సీజ్ చేసి ఆర్టీసీ డిపోకు తరలించారు.భద్రతా ప్రమాణాలు ఫిట్నెస్ లు పాటించకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని బస్సు యజమానులను హెచ్చరించారు.సరైన ఫిట్నెస్ లేని బస్సులలో ప్రయాణించరాదంటూ ప్రయాణికులకు సూచించిన ఎంవిఐ అధికారులు.ప్రమాదాలు సంభవించినప్పుడు భద్రతా ప్రమాణాలు లేని బస్సుల్లో ప్రయాణిస్తే తీవ్ర ఇబ్బందులకు గురువుతూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కొరకు బాధ్యత రహితంగా తనిఖీలు చేపడుతున్నామని ప్రయాణికులకు సరైన సౌకర్యాలను కల్పించే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు చేపడుతున్నామని ప్రయాణికులకు తెలిపారు.ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా సౌకర్యాలు కల్పించకుండానే బస్సులను సీజ్ చేయడం పై ప్రయాణికులు రోడ్లపై అసౌకర్యానికి గురై అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ,అర్ధరాత్రి వేళలో మహిళా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతారని తెలిసిన అధికారులు ఇలా వ్యవహరించడం సమంజసం కాదని మహిళ ప్రయాణికులు విమర్శించారు.ప్రయాణికుల విమర్శలతో సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద ఎంవిఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా సూళ్లూరుపేట ఎంవిఐ అధికారి అనిల్ కుమార్ ను వివరణ కోరెందుకు పాత్రికేయులు అక్కడికి చేరుకోగా ఎంవిఐ అధికారి అనిల్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సందేహాలకు త్రావెత్తుతుందని ప్రయాణికులు తెలిపారు.
