సర్పంచ్ ముద్దు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 }
శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మండల ప్రాథమిక పాఠశాలలో కోల్పూర్ గ్రామ సర్పంచ్ ముద్దు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ముందుగా పాఠశాల మహిళా ఉపాధ్యాయురాలులకు శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ ముద్దు రాముల మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి చదువులు తల్లి సావిత్రిబాయి పూలే అని కొనియాడడం జరిగింది చదువుల తల్లి సావిత్రిబాయి పూలే కావడానికి వారి భర్త అయినటువంటి మహాత్మ జ్యోతిబాపూలే ఆమెకు వెన్నంటు ఉండి దేశానికి ఆదర్శం నిలవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థినిలు సర్పంచ్ ముద్దు రాములు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప పాఠశాల సిబ్బంది డాక్టర్ తేజస్విని ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామం వార్డ్ మెంబర్లు యువకులు పెద్దలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
