సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మానం..
రుద్రూర్, డిసెంబర్ 15 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగామణి- గంగారాంలతో పాటు వార్డు సభ్యులను సోమవారం సహాయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సహాయ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో తమ సంస్థ సహాయ సహకారాలు అందజేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు, కోర్భ సాయిలు, అనిల్ పటేల్, సయ్యద్ బషీర్, గంగారం, పోశెట్టి, తదితరులు పాల్గొన్నారు.