సర్పంచ్ స్థానాలకు 24 నామినేషన్లు వార్డు స్థానాలకు 74.
పయనించే సూర్యుడు డిసెంబర్ 05 ప్ ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ఏన్కూర్
:గార్ల ఒడ్డు కాంగ్రెస్ పార్టీ తరఫున శెట్టిపల్లి ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థిగా భూక్యా నర్సి లాలు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందిఏన్కూర్ మండలంలో ఏడు నామినేషన్ కేంద్రాల ద్వారా గురువారం 21 సర్పంచ్ స్థానాలకు గాను 24 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాలకు 74 నామినేషన్లు వచ్చాయి. నేడు (శుక్రవారం) చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్ కేంద్రాలను జిల్లా, మండల అధికారులు పరిశీలించారు. ఎస్సై సంధ్య తమ సిబ్బందితో కలిసి నామినేషన్ల కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు.
