PS Telugu News
Epaper

సాగు అనుభవంలో ఉన్నా లేకపోయినా దళితుల భూములు దళితులకే చెందాలి

📅 21 Jan 2026 ⏱️ 2:26 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

రీసర్వే పేరుతో దళితుల భూముల్లో మోసం చేస్తే సహించం- ఆంధ్ర ప్రదేశ్ దళిత సమాఖ్య వ్యవస్థాపకులు కొమ్ము పాలెం శ్రీనివాస్ మాట్లాడుతూ, దళితులకు సహకరించి సమన్యాయం చేయాలని వినతి పత్రం ప్రజాదర్బాల్లో ఇచ్చిన విషయంపై నంద్యాల మండలం రూరల్ రెవిన్యూ మెజిస్ట్రేట్ కు భీమవరం గ్రామం లో సీలింగ్ భూమిలో 50 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనుభవంలో ఉన్నవారికి పట్టాదార్ పాస్ బుక్కులు, రెవిన్యూ ఉన్నతాధికారులు మరియు భూ రిసర్వే జరుగుతున్న దళితుల భూముల్లో సాగులో ఉన్న వారికి ఆన్లైన్ ఎక్కించి ఇవ్వాలని వివరించారు. దళితులను పదే పదే తమ కార్యాలయాలకు తిప్పుకుంటూ వారి సమయాన్ని వృధా చేయడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు మనోవేదనకు గురి చేస్తున్న అధికారులు న్యాయం జరగడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్ భూమిని అనుభవంలో ఉన్న లేకపోయినా దళితుల భూమి దళితులకే చెందేట్టుగా ప్రభుత్వం మరియు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకొని దళితులకు న్యాయం చేయాలని కోరారు , నిరుపేద దళితులకు సహకరించి సమన్యాయం చేయాలని తెలిపారు.గతంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ భూములకూ కు రక్షణ లేకుండా పోయిందని రికార్డుల ప్రకారం దళితులకు ఎంత భూమి ఉందో, అంత భూమిని రిసర్వ్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పై ప్రత్యేక ఏర్పాటు గుర్తించుకోవాలని ఇప్పటికే ఆన్లైన్ లో వున్న భూమి కి ఈ పాసు పుస్తకాలు ఇవ్వాలని దళితులను మనోవేదనకు గురిచేసిన రెవిన్యూ అధికారులు బాధ్యత వహించవలసి వస్తుందని నంద్యాల మండలం అధ్యక్షులు ఆల్వకొండ ప్రేమ్ కుమార్ తెలిపారు.ఈ విషయంపై నిజంగా సాగుదారులు ఎవరు, అనర్హుగులు ఎవరు, అని గుర్తించి రైతులకు న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామని రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఆంధ్ర ప్రదేశ్ దళిత సమాఖ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు.

Scroll to Top