PS Telugu News
Epaper

సాయి లిఖిత మృతి పై సమగ్ర విచారణ జరపాలని పిడి ఎస్ యు పి ఓ డబ్ల్యు డిమాండ్

📅 22 Dec 2025 ⏱️ 5:15 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

సాయి లిఖిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
మెండోరా మండలం పోచంపేట్ గ్రామంలో బాలికల రెసిడెన్షియల్ లో చదువుతున్న 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత మరణం పై సమగ్ర విచారణ జరపాలని యు- పి ఓ డబ్ల్యు ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం సత్తెక్క పిడిఎస్యు ఏరియా అధ్యక్షుడు డి నిఖిల్ మాట్లాడుతూ విద్యార్థి సాయి లిఖిత గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అక్కడ ఉన్న ఏఎన్ఎం ఇన్చార్జి ప్రిన్సిపల్ సిబ్బంది ఆ విద్యార్థిని పట్టించుకోకపోవడం వల్ల ఉదయం వాంటింగ్ చేసుకోవడం వల్ల అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మళ్లీ తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం తెలుపకుండా మరుసటి రోజున ఆ అమ్మాయి తీవ్ర అనారోగ్యానికి గురైతే అప్పుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది అక్కడి నుండి నిర్మల్ లోని స్వప్న సూపర్ స్పెషాలిటీ కు డాక్టర్లు అమ్మాయి కి డెంగ్యూ అని రిపోర్ట్ ఇచ్చారు అక్కడి నుండి హైదరాబాద్ మీలోఫర్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యం అందిస్తున్న అమ్మాయి 17న ఉదయం 7:20 చనిపోయింది అని వైద్యులు చెప్పరు. అమ్మాయి బాడీని పాఠశాల దగ్గరకి తీసుకొచ్చిన్న కనీసం అమ్మాయి చూడాలని వారు అన్నారు దీనికి సంబంధించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే అమ్మాయి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా మరియు అమ్మాయి కుటుంబంలో ఒకరికి అర్హతకు తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి , సాయి లిఖిత వాళ్ళ అన్న ఆయన ఇంతవరకు చదువుకుంటే అంతవరకు ప్రభుత్వమే బాధ్యత వహించాలా అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా కోశాధికారి అరవింద్ , పిడిఎస్ ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు, టి యు సి ఎ ఆర్మూర్ ఏరియా నాయకులు నజీర్ , పిడిఎస్యు నాయకులు వివేక్ వెంకట్ సౌమిత్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top