సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాల వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిక
పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )
సారంపల్లి, దేశాయిపల్లి గ్రామాలకు చెందిన వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ జె (టోనీ), యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు గట్టు రాజీరెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని కేకే మహేందర్ రెడ్డి కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ లో చేరిన వారిని కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనపై నమ్మకంతో పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికీ పూర్తి అండగా ఉంటామని, వారి గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, సారంపల్లి సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య, బైరీనేని రాము, సిరిసిల్ల దేవయ్య, గుగ్గిళ్ళ భరత్ గౌడ్, పొన్నాల పరుశురాం, శ్రీనివాస్, ప్రశాంత్, వెంకట్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
