PS Telugu News
Epaper

సావిత్రిబాయి పూలే 195 వ జయంతిని పూలమాలలతో ఘనంగా నిర్వహించిన విద్యార్థి,యువజన ప్రజా సంఘాలు

📅 03 Jan 2026 ⏱️ 7:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

సావిత్రిబాయి పూలే ను మహిళలు, విద్యార్థినిలు ఆదర్శంగా తీసుకోవాలి

మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి

స్థానిక నంద్యాల పట్టణం బొమ్మలసత్రం నందు వున్న పి.యస్.సి&కే.వి.యస్.వి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతిని డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్.రియాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెరుగు శివ కృష్ణ యాదవ్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు,BAMCEF రాష్ట్ర నాయకులు డా.నిరంజన్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీదేవి, రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బందెల ఓబులేసు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీనివాసులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కడియం సాంబశివుడు, మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో మాయా గాని అనే గ్రామంలో 1831 జనవరి 3 న ఓ చిన్న సన్నకారు రైతు కుటుంబంలో జన్మించారని, సావిత్రిబాయి పూలే గారి కి తన 9వ ఏట 12 ఏళ్ల జ్యోతి రావు పూలే గారికి ఇచ్చి 1840 లో వివాహం చేసుకున్నారు , జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి,విద్యావంతురాలైనదని,సావిత్రిబాయి పూలే, అట్టడుగు వర్గాల మహిళలు చదువులకు మరియు వారి సంపద వంటి సమస్త హక్కులకోసం, దేశంలో అప్పటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా 1848లో మొట్ట మొదటి పాఠశాలను ప్రారంభించారు, స్త్రీలకు విద్య అందించడానికి ఉపాధ్యాయురాలిగా వెళ్తున్న సమయంలో అనేక అవమానాలు ఎదురైనా కూడా పట్టించుకోకుండా స్త్రీల విద్య అభివృద్ధికి కృషి చేసిందని, అంటరానితనం,కుల నిర్మూలన, కోసం పోరాడిన సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే అని వారు కొనియాడారు,ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేశ్వర్లు, సునంద లక్ష్మి,రాధిక, వేదవతి, ప్రశాంతి, హిమబిందు,సుకుమార్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Scroll to Top