“సింపుల్‌గా వచ్చి స్టేజ్ దద్దరిల్లేలా.. కీర్తి సురేష్ డాన్స్ మాయ!”
పయనించే సూర్యుడు న్యూస్ :మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ క్రేజ్ ఇప్పుడు దక్షిణాదిని దాటి బాలీవుడ్ వరకు వెళుతోంది. తెలుగు, తమిళ చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె గతేడాది తమిళ హిట్ తెరి రీమేక్‌గా తెరకెక్కిన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ సినిమా ఫలితం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉన్నప్పటికీ కీర్తి సురేష్ పెర్ఫామెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తెలుగులో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.పెళ్లి కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన కీర్తి సురేష్, ఇప్పుడు మళ్లీ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. అందులో భాగంగా విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మిస్తోన్న రౌడీ జనార్ధన చిత్రంతో దాదాపు మూడేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. అదే సమయంలో మలయాళం, తమిళ భాషల్లోనూ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన కెరీర్‌ను మరింత బలపరుస్తోంది.ఇక సినిమాలకే కాకుండా వ్యక్తిగత జీవితానికీ సమయం కేటాయిస్తున్న కీర్తి సురేష్, ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి వేడుకకు హాజరైంది. ఆ వేడుకలో ఆమె చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దసరా సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’ పాట ఎంత పాపులరో మనకు తెలుసు. అందులో నాని, కీర్తి సురేష్ నటించారు. ఇప్పుడదే పాటకు కీర్తి సురేష్ ఎనర్జీతో స్టెప్పులు వేయగా.. అక్కడున్నవారు చప్పట్లతో హోరెత్తించారు. లైవ్ డ్యాన్స్ అయినప్పటికీ సినిమా డ్యాన్స్‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఆమె పెర్ఫార్మెన్స్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ డ్యాన్స్‌లో హీరో నాని భార్య అంజనా, స్టైలిష్ట్ కమ్ డైరెక్టర్ నీరజ కోన కూడా కీర్తి సురేష్‌తో కలిసి స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారింది. సినిమాలతో పాటు ఇలాంటి క్షణాలతోనూ అభిమానులను ఆకట్టుకుంటూ కీర్తి సురేష్ మరోసారి వార్తల్లో నిలిచింది.