సిడ్నీ ఘటనలో హైదరాబాద్ పాత్రపై భద్రతా సంస్థల పరిశీలన
పయనించే సూర్యుడు న్యూస్ :ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో హైదరాబాద్ లింకులు బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. బీచ్‌లో తన కుమారుడు నవీద్ అక్రమ్‌తో కలిసి కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్‌గా గుర్తించారు. సాజిద్ అక్రమ్ దగ్గర భారత పాస్‌పోర్ట్ లభించింది. 25 ఏళ్ల క్రితం సాజిద్ స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే స్థిరపడినట్టు గుర్తించారు.సాజిద్ కుటుంబసభ్యులను భారత నిఘా అధికారులు విచారించారు. ఆస్తి పంపకాల కోసం సాజిద్ గతంలో ఓసారి హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. సిడ్నీ బాండీ బీచ్‌లో యూదుల వేడుకలను టార్గెట్ చేస్తూ సాజిద్ , నవీద్ కాల్పులు జరపడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. నవీద్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.