సిద్దాపూర్ సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేసిన బాసు నాయక్
ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లతో కలిసి ప్రమాణ స్వీకారం
( పయనించే సూర్యుడు డిసెంబర్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన విస్లావత్ బాసు నాయక్ ఈరోజు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్లతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం బాసు నాయక్ మాట్లాడుతూ … తనపై నమ్మకంతో తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.
