సిద్ధారం గ్రామ ఆదివాసిగిరిజనుల పోడు సమస్యను వెంటనే పరిష్కరించాలి.
ఐటీడీఏ పీవో కి వినతి పత్రం ఇచ్చిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి. వెంటనే చర్యలు చేపడతామని చెప్పిన పిఓ
పయనించె సూర్యుడు ఫిబ్రవరి 24(పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి: మండలం సిద్ధారం గ్రామంలో గత కొన్ని దశాబ్దాలుగా పోడు భూమి సాగుచేసుకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చి మరి కొంత మందికి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వారు ఎంతో కాలం నుండి పంటలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్న గిరిజనులను ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఈ సంవత్సరం పత్తి పంటను తీయనియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి పంటలు పండిస్తే ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాల కారణంగా గిరిజన రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సత్వరమే ఐటీడీఏ పీవో గారు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించి రైతులకు పంటలు తీసుకునే అవకాశం కల్పించాలని ఆ తరువాత సమగ్ర సర్వే జరిపి గిరిజన రైతులకు అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలని కోరారు గ్రామంలో గిరిజన రైతుల మధ్య కొంతమందికి పట్టాలు ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేయటం కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని గిరిజనుల మధ్య వైశ్యామ్యాలు పెరిగే అవకాశం ఉందని గుమ్మడి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే గిరిజనులను కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు టేకులపల్లి మండలంలో కొండంగలబోడు గ్రామంలో అటవీ హక్కుల పట్టా కలిగిన గిరిజన రైతు జరపల సుందర్ తన పొలంలో వ్యవసాయ నిమిత్తం తుప్పలు తొలగించి వ్యవసాయానికి సిద్ధం చేస్తున్న అతనిపై స్థానిక ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా అక్రమ కేసు బనాయించి ఇబ్బందులకు గురి చేశారని ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ఈ దౌర్జన్యాలకు పాల్పడితే గిరిజనుల వైపు నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ కృష్ణ డివిజన్ నాయకులు ఆజాద్ సుందర్ గిరిజన రైతులు కంగాల నాగేశ్వరరావు కొరస మల్లయ్య దొడ్డ అంజయ్య కొమరం దినేష్ పాయం వెంకటేశ్వర్లు మలకం ఆదినారాయణ జోగా శ్రీను కొరస శ్రీకాంత్ పాయం లక్ష్మీనారాయణ జరపల సుందర్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులుయళ్లపల్లి ఆజాద్ తదితరులు పాల్గొన్నారు