అంతర్జాతీయంగా గుర్తింపు—‘మహావతార్ నరసింహా’కి ప్రత్యేక గౌరవం!
పయనించే సూర్యుడు న్యూస్ :భారతీయ యానిమేషన్ రంగానికి కొత్త దారులు చూపించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘మహావతార్ నరసింహా’. తాజాగా ఈ సినిమా మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును పొందింది. మహావిష్ణువు అవతారమైన నరసింహుడి పురాణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించారు. నరసింహుడి ఉగ్రరూపం, విజువల్ గ్రాండియర్‌తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన కథనం.. ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి. […]




