PS Telugu News
Epaper

సిపిఎం బిఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులను గెలిపించాలి

📅 09 Feb 2026 ⏱️ 2:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

6, 9 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 09 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి, వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం,సిపిఐ,బిఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఓటర్లను విజ్ఞప్తి చేశారు.ప్రచారానికి చివరి రోజున వైరా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థి మాదినేని రజిని,9వ వార్డు సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థి గుడిమెట్ల రజిత గెలిపించాలని ఆయన ఇంటింటి విస్తృత ప్రచారం నిర్వహించారు. 6వ వార్డు పరిధిలోని సుందరయ్య నగర్, 9వ వార్డు పరిధిలోని రాజశేఖర్ నగర్ ప్రాంతాల్లో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా వైరా మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. ముఖ్యంగా రాజశేఖర్ నగర్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపాలిటీ పాలకులు దీనిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.ప్రజల పక్షాన నిలబడి స్థానిక సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిరంతరం ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే నిజాయితీ గల ప్రతినిధులుగా సిపిఎం,సిపిఐ,బిఆర్ఎస్ కూటమి అభ్యర్థులు మాత్రమే ఉంటారని పేర్కొంటూ, వారిని గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో 9వ వార్డు అభ్యర్థి గుడిమెట్ల రజిత, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పారుపల్లి ఝాన్సీ, మెరుగు రమణ,సిపిఎం, బిఆర్ఎస్, టిడిపి నాయకులు బాణాల శ్రీనివాసరావు, కె. నరేంద్ర, మచ్చా నరేంద్ర, కొండబోయిన ఉమావతి, వజ్జా రామారావు, తాతా పద్మ, బాదావత్ శ్రీనివాస్ , బానోతు బన్సీలాల్ , తాళ్లపల్లి విజయ, బాజోజి రమణ, తోట కృష్ణవేణి, కంసాని మల్లిక, శ్రీదేవి, సుంకర భాస్కర్, నరేష్, అప్పారావు, ప్రసాద్, బోడపూడి వీరభద్రం, బాణాల వెంకట్రావమ్మ ,సుబ్రహ్మణ్యం , షేక్ బిలాల్ షేక్ మజీద్ బి రెహనా, రుద్రాక్షల వెంకటాచారి, నారికొండ అమరేందర్, ముత్తమాల విజయ రావు బాణాల కృష్ణమ చారి, యరమల మాధవ రెడ్డి,పగిడిపల్లి కాటయ్య ,సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top