PS Telugu News
Epaper

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి

📅 11 Oct 2025 ⏱️ 2:42 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు, అక్టోబర్ 11( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) మాట్లాడుతూ, “నిరుపేదల వైద్యానికి సీఎం సహాయనిధి ఎంతో మేలుచేస్తోంది. రోగుల కష్టసమయంలో సీఎం రేవంత్ రెడ్డి సాయం ఆశీర్వాదం లాంటిదని” తెలిపారు.ఇందిరమ్మ కాలనీ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంపల్లి శ్యామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్ (₹22,500), భీమనపల్లి అజయ్ (₹10,500), ఎండీ చిన్నియాభి (₹51,000) లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.లబ్ధిదారుల కుటుంబాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ & వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాలగం ప్రవీణ్ (టోనీ) కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో బొద్దు రాధవ్వ, అంబటి ఆంజనేయులు, అడేపూ శ్రీనివాస్, అంకారపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు

Scroll to Top