సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి
సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన చైర్ పర్సన్ బోదిరే గంగమణి స్వామి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో
పురపాలక కార్యాలయం నందు పట్టణంలో మంజూరైన 20 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. అనారోగ్యానికి గురై సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి చెక్కులు మంజూరు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. పట్టణంలో వివిధ వార్డ్ కు చెందిన 20 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి మరియు బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సంటి లత నర్సయ్య కౌన్సిలర్ తోట సతీష్ సందీప్ ఆరెపల్లి నాగేంద్రబాబు అనంతరావు ప్రజా ప్రతినిధులు బాలగంగాధర్ గంగయ్య నవీన్ కిరణ్ దినేష్ శ్రీకాంత్ లబ్ధిదారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
