సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్
కడియాల కుంట తండా డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్
( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యశ్రీ తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేయడం జరిగింది. ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా కు చెందిన పాల్త్యవత్ వెంకటేష్ కు 27,000/- మరియు పాల్త్యవత్ జమున కు 55,000 /- అందజేయడం జరిగింది. ఫరూక్నగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడియాల కుంట తండా మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ మరియు డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్, వార్డ్ నెంబర్ తావు సింగ్ నాయక్, వివోఎ రాజు నాయక్, రాత్లావత్ రమేష్ నాయక్, రాజు నాయక్ రెడ్యా ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
