PS Telugu News
Epaper

సీనియర్ జర్నలిస్టు కెపి కు వివావా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన షాద్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్

📅 17 Feb 2026 ⏱️ 6:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

జర్నలిస్ట్ కేపినీ సన్మానించిన మున్సిపల్ వైస్ చైర్మన్

అందె మోహన్ ను సన్మానించిన జర్నలిస్టు కెపి

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు ఎండి ఖాజా పాషా (కేపి), శ్యామల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా షాద్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం కెపి స్వగృహంలో ఆయనను కలుసుకుని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపికైన అందేమోహన్ ను జర్నలిస్టులు కేపీ, రాఘవేందర్ గౌడ్, ధర్మపాల్ సింగ్, మాజీ జర్నలిస్టు అక్రమ్ తదితరులు సన్మానించారు. *రాజకీయంగా అభివృద్ధి సాధించాలి* షాద్ నగర్ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించి ముదిరాజ్ ముద్దుబిడ్డగా ఎంతో ప్రగతి సాధించాలని రాజకీయాల్లో భవిష్యత్తులో మరింత రాణించాలని జర్నలిస్టు కేపీ అంతే మోహన్ ను ఆశీర్వదించారు. అందమోహం కుటుంబంతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఆయన సందర్భంగా తెలిపారు. అందే కుటుంబ సభ్యులతో తనకున్న ఆప్యాయత తదితర అంశాలను చర్చించుకుని ఈ స్థాయికి ఎదిగిన ముదిరాజ్ ముద్దుబిడ్డగా మోహన్ ఎదిగిన తీరు తనకెంతో గౌరవంగా ఉందని, యువతకే ఒక గొప్ప ఆదర్శమని జర్నలిస్టు కెపి తెలిపారు.

Scroll to Top