PS Telugu News
Epaper

సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని : పాలూరి సత్యానందం

📅 26 Feb 2026 ⏱️ 6:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 26 అమలాపురం ప్రతినిధి

ఏపి శాసన మండలిలో శాసనమండలి బిజెపి ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు సిగ్గుచేటని బీజేపీ రాష్డ్ర కార్యవర్గ సబ్యులు పాలూరిసత్యానందం ఖండించారు.
సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు
. సభలో మహిళా మంత్రులు అని కూడా చూడకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమ ఎత్తిపోతల పధకంపై చర్చ సందర్బంగా మైకు తీసుకొని మాట్లాడే సమయంలో ప్రశ్న అడగకుండా అడ్డుకునేందుకు మైకు లాక్కొనడానికి ప్రయత్నించి సోముపై వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన దాడి ప్రజలు చూస్తున్నారు.ప్రజలు మీపార్టీకి చమరగీతం పాడిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు అయినా మీతీరు మార్చుకోలేదని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు “ప్రశ్నించే గొంతును అడ్డు కుంటే చూస్తూ ఊరుకోమని మానాయకుడుకి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Scroll to Top