సుండుపల్లి మండల పోలీస్ శాఖ – ప్రజలకు విజ్ఞప్తి
పయనించే సూర్యుడు జనవరి 12 కడప సుండుపల్లె మండలం
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సుండుపల్లి మండల పరిధిలోని ప్రజలందరికీ సుండుపల్లి మండల పోలీస్ శాఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సంక్రాంతి పండుగ అనేది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, శాంతియుతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకునే మహత్తరమైన పండుగ. అయితే ఈ పండుగను అవాంఛనీయమైన, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చకూడదని పోలీస్ శాఖ ప్రజలను విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంలో కోడిపందెం, మట్కా, జూదం, ఇంటిని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసు వారికి సమాచారం ఇస్తే ఆ ఇంటిపై పోలీసులు నిఘా పెట్టుబడుతుందని, దూర ప్రయాణాలు చేసేవారు తమ విలువైన బంగారు వస్తువులను జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకుని ప్రయాణం చేయాలని సూచించారు. అలాగే ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇతర చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టంగా తెలియజేయబడుతుంది.ఇలాంటి అక్రమ కార్యక్రమాలపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఏర్పాటు చేసి, ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించనుంది. చట్టాన్ని అతిక్రమించే వారిపై ఎలాంటి సడలింపులు ఉండవని హెచ్చరిస్తోంది. కావున సుండిపల్లి మండల పరిధిలోని ప్రజలందరూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, శాంతియుతంగా చట్టాన్ని గౌరవిస్తూ సంప్రదాయ విలువలను కాపాడుతూ జరుపుకోవాలని సుండుపల్లి మండల పోలీస్ శాఖ హృదయపూర్వకంగా కోరుకుంటోంది.ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలు సాధ్యమవుతాయని, ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది.– ఎస్ఎంకె హుస్సేన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుండుపల్లి మండలం.