
పయనించే సూర్యుడు అక్టోబర్ 17 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటివల కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ర్ గవాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ సూళ్లూరుపేట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 10 గంటలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ సిపిఎం నాయకులు సిఐటియు అధ్యక్షులు సుధాకర్ రావు , మాట్లాడుతూ ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి దీనిని యావత్ భారతీయులందరూ ముక్తకంఠంతో ఖండించాలని తెలియజేశారు సిపిఎం టౌన్ కార్యదర్శి రియాజ్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీల మీద దళితుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి అని అన్నారు KVPS తిరుపతి జిల్లా కార్యదర్శి డమాయి ప్రభాకర్ మాట్లాడుతూ ఇది కేవలం జస్టిస్ గవాయి మీద దాడి మాత్రమే కాదు 145 కోట్ల భారతీయుల మీద దాడి ఈ దాడులను నియంత్రించకపోతే మరో స్వతంత్ర ఉద్యమానికి ఈ దేశం సిద్ధమవుతోంది అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ డీకేఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు దూడల రఘు , జాయింట్ సెక్రెటరీ అక్బర్ బాషా , వేణు , భాస్కర్ , దారా కోటయ్య ,ఇరకం పెంచలయ్య, మర్రి చినరాజు , ముత్తుకూరు బాలకృష్ణ , తదితరులు పాల్గొన్నారు