సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేద ప్రజలకు చేసిన సేవలు నిలిచే ఉంటాయి…
పయనించే సూర్యుడు జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
చరిత్ర సృష్టించడం కోసమే పుట్టిన మహానేత ఎన్టీఆర్…తెలుగుజాతి చరిత్రలో ఎన్టీఆర్ కీర్తి అజరామరం…
ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన దగ్గుబాటి పురందేశ్వరి
ఎన్టీఆర్ పరమపదించి 30 సంవత్సరాలు అయినా అందరి హృదయాలలో సజీవంగానే ఉన్నారు.నాయకుడిగా, ప్రతి నాయకుడిగా అనితరసాధ్యమైన పాత్రలు పోషించిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ.రాజకీయాలు అధికారం కోసం కాదు, ప్రజాసేవకని నిరూపించిన మహనీయుడు ఆయన.ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఈనాడు రూపాంతరం చెందాయేమో కానీ, నేటికీ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇది ఆయన సంకల్పానికి, ప్రజల పట్ల ఆయన అంకితభావానికి నిదర్శనం.
ఆ మహనీయుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయని విశ్వసిస్తున్నాను. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పునందేశ్వరి అన్నారు
