PS Telugu News
Epaper

సూళ్లూరుపేట నేషనల్ హైవే ఎక్కితే ప్రాణాలు గాలిలో కే

📅 31 Mar 2026 ⏱️ 6:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 31 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణానికి అనుకొని ఉన్న ఆర్టీసీ డిపో దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగినది ఆ రోడ్డు ప్రమాదంలో ఒక డ్రైవర్ చనిపోగా మిగతా వాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి సూళ్లూరు పేట నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఆటో లో ప్రయాణికులతో వెళుతుండగా నేషనల్ హైవే పైన మద్యం ఫుల్లుగా సేవించి కారు నడుపుకుంటూ నేషనల్ హైవే మీద ముందుగా వెళుతున్న ఆటోని బలంగా ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్ సుధాకర్ 45 సంవత్సరాలు డివైడర్ పైన పడిపోయాడు అదే సమయంలో వెనకనుంచి వచ్చిన మినీ లారీ అతని మీదగా వెళ్ళింది దీంతో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు గొల్ల పాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే స్థానికులు సహాయంతో గాయపడిన వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సూళ్లూరుపేట ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని నేషనల్ హైవేపై ట్రాఫిక్ ని క్లియర్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న సూళ్లూరుపేట ఎస్సై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళని పరామర్శించి చనిపోయిన వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.ఆటోని కారుతో గుద్దిన వెంటనే పరారైన కారు డ్రైవర్ పై సూళ్లూరుపేట ఎస్సై విచారణ చేపడుతున్నారు కార్ నెంబర్ AP 03 BR 7989 బాధ్యతలు గాలికి వదిలేసి ఫుల్లుగా మందు తాగి ఎదుటి కుటుంబం ఏమవుతుందని ఆలోచన లేకుండా ఇలాంటి తాగుబోతు డ్రైవర్లని ఏం చేయాలో చట్టం నిర్ణయిస్తుంది హైవే కి ఆనుకొని బ్రాందీ షాపులు రెస్టారెంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఫుల్లుగా ముందు కొట్టు హైవే పైన ప్రాణాల తీ లేకపోతే ప్రాణాలు వదులు అనే సామెతతో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది ఎవ్వరికి ఏమైతే మాకెందుకులే మాకు డబ్బు వస్తుంది ఇలాంటి హైవేలు పైన ఇకనైనా తగిన జాగ్రత్త తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

Scroll to Top