సూళ్లూరుపేట పురపాలక సంఘ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్మరణ దినం నిర్వహించడం జరిగినది
పయనించే సూర్యుడు డిసెంబర్ 6 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట పురపాలక సంఘ కార్యాలయంలో సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ వర్థంతి మరియు సంస్మరణ దినం (మహా పరిణిర్వాణ దివస్) నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగముగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ పి. శ్రీనివాస్ , రెవెన్యూ ఆఫీసర్ పి.యం.వి. నారాయణ రెడ్డి , రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు….