PS Telugu News
Epaper

సూళ్లూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనక్కి వెళ్ళింది

📅 07 Jan 2026 ⏱️ 1:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )

సూళ్లూరుపేట పేరుకే మున్సిపాలిటీ కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ముఖచిత్రం పంచాయతీ లాగా మారిపోయింది అనీ సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు,సూళ్లూరుపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట మున్సిపాలిటీ అయినా మొదటిలో పేటలో అభివృద్ధి మొదలైంది , వీధులు, వీధి రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, డ్రైనేజీ కాలవలు C C రోడ్లు నిర్మాణాలు, చాలావరకు మెరుగుపడ్డాయి, GNT రోడ్ లో పురపాలక మరుగుదొడ్లు నిర్మాణం అభివృద్ధి దిశగా వెళ్ళింది…. , కానీ ఇప్పుడు, అభివృద్ధిలో వెనక్కి వెళ్ళింది ? ఇప్పుడు సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా అన్ని సమస్యలే, లక్షలు ఖర్చుపెట్టి ప్రజా మరుగుదొడ్లు కట్టిస్తే కొన్ని దగ్గర మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి, వీటి వైపు మున్సిపల్ అధికారులు ఎవరు కూడా కన్నెత్తి కూడా చూడలేదు. గతంలో చిన్నదిగా ఉన్న GNT రోడ్డును విస్తరణ చేశారు కానీ ఇప్పుడు మున్సిపాలిటీలోని GNT రోడ్డు ముఖచిత్రం మారిపోయింది రోడ్డు చిన్నదిగా మారింది అక్రమ దారులు రోడ్డుతో సహా ఆక్రమించి దాదాపు పది అడుగులు రోడ్డుని శాశ్వతంగా ఆక్రమణ చేశారు ఇందువలన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది వాహనాల రాద్ది పెరగడంతో, పాదాచార్యులు GNT రోడ్లో నడిచి వెళ్లాలంటే ఎనుకు ముందుకు చూసుకుంటూ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఏదైనా ఒక 4 చక్రాలవాహనం అక్కడ కాసేపు నిలిచిందంటే మొత్తం ట్రాఫిక్ అవుతుంది మరి ముఖ్యంగా R&B మరియు మున్సిపల్ అధికారులు కలిపి GNT రోడ్డులో ఉన్న చందన షాపింగ్ మాల్ యాజమాన్యానికి అనాధికారికంగా అమ్మేశారు పర్మినెంట్ గా ఇచ్చేశారు చందన షాపింగ్ మాల్ పర్మెంటు సిమెంట్ కాంక్రీట్ తో 10 అడుగులు రోడ్డుని ఆక్రమించుకొని పర్మినెంట్ ఒక రూము వేసుకున్నారు, ఒక సామాన్యుడు పట్టణానికి దూరంగా ఇల్లు కడుతుంటే దానికి సవాలక్ష కారణాలు, అనుమతులు లేవని నోటిసులు ఇస్తారు, మరియు అనుమతి లేని ఇళ్లను స్తుతులతో పగలగొట్టిస్తారు అందుకు సంతోషమే, కానీ ధనవంతునికి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం ఇంత పెద్ద చందన షాపింగ్ మాల్ కి గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ లేకుండా సంబంధిత అధికారులు కమర్షియల్ బిల్డింగ్ కి అప్రూవ్ ఎలా ఇచ్చా రో అధికారులకే తెలియాలి రోడ్డుని ఇలా పర్మినెంట్ గా ఆక్రమిస్తుంటే ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్, అధికారులు నిద్రలో ఉన్నారు, ఇకనైనా మేల్కోండి . GNT రోడ్ లోని ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరించి నూతన సంవత్సరంలో న ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా తెలియజేశారు

Scroll to Top