PS Telugu News
Epaper

సూళ్లూరుపేట మెకానికల్ ఆవేదన కలెక్టర్‌కు వినతి పత్రం,

📅 10 Mar 2026 ⏱️ 1:14 PM 📝 HOME
Listen to this article

పయనించేసూర్యుడు మార్చు 9 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని మెకానిక్ల జీవనోపాధి కోసం ప్రత్యేకంగా ‘ఆటో నగర్’ ఏర్పాటు చేయాలని ఆల్ మోటార్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత 35 సంవత్సరాలుగా ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, 2016లో “ఆల్ మోటార్ వర్కర్స్ అసోసియేషన్” (Regd. No.47/2016)ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సుమారు 100 మంది మెకానిక్లు అద్దె షాపుల్లో పని చేస్తూ పెరుగుతున్న అద్దెల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.పని చేసేందుకు సరైన స్థలం లేకపోవడం వల్ల వృత్తిని కొనసాగించడం కష్టంగా మారిందని, సూళ్లూరుపేట పట్టణ పరిధిలో మెకానిక్ల కోసం ప్రత్యేకంగా ‘ఆటో నగర్’ ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ వినతిపత్రాన్ని యూనియన్ ప్రెసిడెంట్ కుప్పంపాటి మారియప్ప, సెక్రటరీ కె. రామూర్తి, జాయింట్ సెక్రటరీ ఎస్. మధు, లీగల్ అడ్వైజర్ వాకాటి మల్లికార్జున సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యులు పి. అశోక్, సర్వణ, ఎస్‌కే బాషా, పి. కిషోర్, హరి, కుమార్, పవన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top