PS Telugu News
Epaper

సెట్విన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి సతీమణి వాకిటి లలిత..

📅 25 Mar 2026 ⏱️ 7:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

విద్యార్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచన..

{పయనించే సూర్యుడు} {న్యూస్ 26మక్తల్ }

తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక డెయిరీ క్రీడా మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో తన సొంత నిధుల నుంచి మక్తల్ నియోజకవర్గం లో పూర్తి ఉచితంగా సెట్విన్ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ను ఏర్పాటు చేయగా… కంప్యూటర్ టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటీషియన్ కోర్సులలో 240 మంది విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత సూచించారు. బుధవారం మక్తల్ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న సెట్విన్ కేంద్రంను వాకిటి లలిత సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం కంప్యూటర్, టైలరింగ్, జర్దోసి మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్సులలో ఉచితంగా శిక్షణ పొందుతున్న 240 మంది విద్యార్థులను స్వయంగా కలుసుకొని అందుతున్న శిక్షణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి ఉచిత నోట్ బుక్స్ అందజేశారు.ఈ సందర్భంగా వాకిటి లలిత మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుంచి మహిళలు స్వయం ఉపాధి పొందేందుకుగాను వివిధ విభాగాల్లో మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో ఉచిత శిక్షణను అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు నెలల పాటు శిక్షణ అందించి హైదరాబాద్ సెట్విన్ కేంద్రం చే పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ సర్టిఫికెట్ అందిస్తామని, దీంతో పాటు ఉపాధి పొందేందుకు బ్యాంకు రుణాలు సైతం అందిస్తుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఆయా రంగాల్లో రాణించి, స్వయం ఉపాధి పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సెట్విన్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, మక్తల్ సెట్విన్ ట్రెయినర్లు తిమ్మన్న, వీరమ్మ, స్వప్న ,ఫర్హానా, సిబ్బంది ప్రవీణ్, లక్ష్మీ, స్థానిక వార్డు కౌన్సిలర్ కలాల్ శ్రీ విద్య నిరంజన్ గౌడ్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవి కుమార్, మార్కెట్ డైరెక్టర్ శాలంబిన్ ఉమర్, నాయకులు నాగరాజు, పూజ శివ, ఓబులేష్ ,కల్లూరి గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top