PS Telugu News
Epaper

సెప్టెంబర్ 8 నుంచి రాయికల్ మండల పాఠశాలల క్రీడలు

📅 26 Aug 2025 ⏱️ 8:50 AM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఆగస్టు 25 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండల పాఠశాలల క్రీడలు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవనున్నాయి. ఈ మేరకు సోమవారం రాయికల్ ఎం ఆర్ సి0లో మండల విద్యాధికారి రాఘవులు అధ్యక్షతన మండల వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది.క్రీడల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ, సెప్టెంబర్ 8న అండర్-14, అండర్-17 బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 9న అండర్-14, అండర్-17 బాలురకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 10న అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు తెలిపారు.ఈ క్రీడలను రాయికల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. అండర్-14 విభాగంలో 1.1.2012 తర్వాత జన్మించిన వారు, అండర్-17 విభాగంలో 1.1.2009 తర్వాత జన్మించిన విద్యార్థులు మాత్రమే జనన ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు మండల కన్వీనర్ పి.డి. కృష్ణ ప్రసాద్ (9440037393)ను సంప్రదించవచ్చు.ఈ సమావేశంలో పి.డిలు రాజగోపాల్, గంగాధర్, సుజాత, రమేష్,కిషోర్, ప్రతాపరెడ్డి, రాజ్‌కుమార్, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top