స్టేట్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో రాణించిన ఈనాడు లక్ష్య అథ్లెట్
కాంస్య పథకంతో మెరిసిన షాద్నగర్ అమ్మాయి
అభినందించిన కోచ్ పాండు నాయక్
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఆగస్టు 30 నుంచి 31 వరకు జరిగిన 11 వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో షాద్నగర్ కు చెందిన జంగా దేవి ప్రియ కాంస్య పథకం గెలుపొందడం జరిగింది. బాలికల మిడ్లే రిలే 16 సంవత్సరాల కేటగిరిలో జంగా దేవి ప్రియ కాంస్య పతకం గెలుపొందించడం జరిగింది. దీంతో కోచ్ ఈనాడు పాండు నాయక్ అభినందిస్తూ మీడియాకు ప్రకటనలో తెలిపారు.