స్మశానం నుంచి వస్తున్న వింత సౌండ్స్ – గ్రామస్తులు భయంతో వణికిపోయారు!
పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పాతి పెట్టిన మృతదేహన్ని వెలికి తీసే ప్రయత్నం జరిగింది. పట్టపగలు డెడ్ బాడీ ని ఒక యువకుడు తీసేందుకు యత్నిస్తుండగా స్థానికులు గుర్తించారు. ఒక్కడే గుంతను తవ్వుతుంటే స్థానికులకు అనుమానం వచ్చింది. సుమారు 5 అడుగుల మేర ఎత్తు 30ఏళ్ళు పైగా ఉండే యువకుడి పట్టుకుని ప్రశ్నించారు. హిందీ మాట్లాడుతూ కాస్త తేడాగా కనిపించిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పాతి పెట్టిన మృతదేహన్ని వెలికి తీసే ప్రయత్నం జరిగింది. పట్టపగలు డెడ్ బాడీ ని ఒక యువకుడు తీసేందుకు యత్నిస్తుండగా స్థానికులు గుర్తించారు. ఒక్కడే గుంతను తవ్వుతుంటే స్థానికులకు అనుమానం వచ్చింది. సుమారు 5 అడుగుల మేర ఎత్తు 30ఏళ్ళు పైగా ఉండే యువకుడి పట్టుకుని ప్రశ్నించారు. హిందీ మాట్లాడుతూ కాస్త తేడాగా కనిపించిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న మదనపల్లి రూరల్ పిఎస్ పోలీసులు ఘటనపై ఆరా తీశారు. మదనపల్లి మండలం అంకిశెట్టి పల్లి కి వెళ్లే మార్గం లోని స్మశాన వాటికలో 3 రోజుల క్రితం పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసే ప్రయత్నం జరిగినప్పుడు గుర్తించారు. గత శుక్రవారం మదనపల్లికి చెందిన 22 ఏళ్ల దిలీప్ రావు అనారోగ్యంతో మృతి చెందగా యువకుడి డెడ్ బాడీని స్మశాన వాటికలో తల్లిదండ్రులు బంధువులు కలిసి పూడ్చిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. పాతిపెట్టిన డెడ్ బాడీని నిన్న సాయంత్రం వెలికి తీసేందుకు గోవింద్ అనే యువకుడు తవ్వకాలు జరిపినట్లు తెలుసుకున్నారు. డెడ్ బాడీ ముఖం కనిపించేలా జరిగిన తవ్వకాలను గుర్తించిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలు జరుపుతున్న వ్యక్తిని రాజస్థాన్ కు చెందిన గోవింద్ గా భావిస్తున్నారు. గోవింద్‌ను అదుపులోకి తీసుకున్న మదనపల్లి రూరల్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే అతనికి మతి స్థిమితం లేనట్టు అనుమానిస్తున్నారు. చిరిగిపోయిన దుస్తులు హిందీలో మాట్లాడుతున్న గోవింద్ ఎందుకు స్మశానంలో తవ్వకాలు జరిపాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూడ్చి పెట్టిన దిలీప్ రావు డెడ్ బాడీతో గోవింద్ కు ఏ సంబంధం ఉందన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. మృతి చెందిన దిలీప్ రావు తల్లిదండ్రులను పోలీసులు ఆరా తీశారు. అయితే, క్షుద్ర పూజల కోసం ఏమైనా తవ్వకాలు జరిపారా అన్న కోణంలోనూ ఇంటరాగేషన్ కొనసాగిస్తున్నారు.