స్వర్గీయ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి బలిదాన దివస్ ఘననివాళులు

June 24, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూన్ 23*(ముమ్మిడివరం, ప్రతినిధి గ్రంధి నానాజీ) భారతీయ జనతా పార్టీ ముమ్మిడివరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత మాత ముద్దుబిడ్డ, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, సార్వభౌమత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. “ఒక దేశం – ఒక రాజ్యాంగం – ఒక జెండా” అనే సిద్ధాంతం కోసం ఆయన చేసిన త్యాగం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.జమ్మూ కాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ దేశ సమగ్రత కోసం పోరాడిన డాక్టర్ ముఖర్జీ ఆశయాలు నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధి, ప్రజాసేవ కోసం అంకితభావంతో పనిచేయాలని పార్టీ కార్యకర్తలు సంకల్పం చేశారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం పట్టణ బిజెపి పార్టీ అధ్యక్షులు సన్నిధిరాజు వీరభద్ర శర్మ, ఉపాధ్యక్షులు పెనుమాల శాంతి శ్రీ, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి బాలకిషోర్, కార్యదర్శి బసవ శ్రీ హరి బాబు, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు అల్లూరు వెంకట సత్యనారాయణ రాజు, దంతులూరి సాయిరాజు, తటవర్తి నాగరాజా రావు, కొయ్యల దుర్గారావు, మరియు బిజెపి పార్టీ కార్యకర్తలు పాల్గొని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కి ఘన నివాళులర్పించారు.

🌐 Select Language:
📰 ePaper