హెల్త్ కార్డులు జారీ చేయకుండానే నెల జీతం కట్
పయనించే సూర్యుడు: న్యూస్ జూన్ 25 మక్తల్:తెలంగాణ రాష్ట్ర పెన్షనర్స్ కు హెల్త్ కార్డులు జారీ చేయకుండానే, విధివిధానాలను రూపొందించకుండానే మే నెల జీతం లో ఒకటి పాయింట్(1.5%) ఐదు శాతం డబ్బులు కట్ చేసుకోవడం దారుణం దీనిని వ్యతిరేకిస్తున్నామని మక్తల్ పెన్షనర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.గోపాలం, బి. భాస్కర్ తెలిపారు. పెన్షనర్స్ అనుమతి లేకుండా1.5% మినాయించడం పెన్షనర్స్ అందరూ ఆందోళనకు గురి అయ్యారని, వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో వైద్య సదుపాయము అందుట లేదు, కొత్త హెల్త్ కార్డులు ఊసే లేదు, ఆసుపత్రులలో వివరాలు ప్రకటించలేదు. భార్య భర్తల ఇద్దరిలో ఒకరి నుండి మాత్రమే కట్ చేయాలి. అసలు పెన్షనర్స్ నుండి హెల్త్ కార్డుల కొరకు ఒకటి పాయింట్ ఐదు శాతం వినయింపు ఇవ్వాలి, వసూలు చేయరాదు. మరి ప్రభుత్వాన్ని నడిపే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గర ఇలాగే వసూలు చేస్తారా చేయరు, మీకేమో బరాబర్ జీతాలు, రాయితీలు. మీరు 5 సంవత్సరాలు పని చేస్తే, మేము 35 సంవత్సరాలు పైబడే పనిచేసాము. మీకు అన్ని ఉచితాలు, మా వైద్యం కొరకు మేము డబ్బులు కట్టాలి. ఇదెక్కడి న్యాయం. ప్రాథమిక హక్కులో భాగంగా పెన్షనర్స్ కు అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందక 58 మంది మరణించారని ఈ మరణాలకు ప్రభుత్వమే కారణమని వారు తెలిపారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. నూతన పిఆర్సి ప్రకటించలేదు. పెన్షనర్స్క అందాల్సిన అన్ని బెనిఫిట్స్ వెంటనే నగదు రూపంలో చెల్లించాలని, పెన్షనర్స్ను హింసించడం మానుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విలేకరుల సమావేశంలో కోశాధికారి సిద్ధి లింగయ్య, రాష్ట్ర బాధ్యులు సూర్యప్రకాష్ పాల్గొన్నారు.