స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి
అన్నారం గ్రామంలో వివేకానంద జయంతి వేడుకలు
పాల్గొన్న గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ
( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్నగర్ మండలం అన్నారం గ్రామ పరిధిలోని గుండె నాయక్ తండలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం సర్పంచ్ లావణ్య రామకృష్ణ మాట్లాడుతూ… యువత స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ వివేకానంద స్వామి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ లావణ్య రామ కృష్ణ , మాజీ సర్పంచ్ బాలు,మాజీ సర్పంచ్ బాలు, వార్డు సభ్యులు కావ్య వినోద్, ప్రశాంత్ గౌడ్ మరియు గ్రామ పెద్దలు లంకల రఘుగౌడ్, వాగ్గుల రాములు, జే రాము, శ్రీను, గణేష్, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.