PS Telugu News
Epaper

హనుమాన్ – శివాలయం నిర్మాణానికి సహాయం

📅 04 Jan 2026 ⏱️ 12:27 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రూ.36,000 విరాళం అందించిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ కంకంటి కృష్ణ

( పయనించే సూర్యుడు జనవరి 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

లక్ష్మీదేవుని పల్లి గ్రామంలోని హనుమాన్–శివాలయ దేవాలయ అభివృద్ధికి కొల్లూరు గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ ట్రేడర్స్ యాజమాని కంకంటి కృష్ణ ఉదార హృదయంతో ముందుకు వచ్చారు. ఈరోజు దేవాలయానికి రూ.36,000/- (ముప్పై ఆరు వేల రూపాయలు) విరాళంగా అందజేయడం జరిగింది.ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం కావడానికి ఈ విరాళం ఎంతో దోహదపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో పాటు భక్తి భావంతో చేసిన ఈ సహకారం ఆదర్శప్రాయమని గ్రామస్తులు ప్రశంసించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కలిసి కంకంటి కృష్ణ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు మద్దతు అందించాలని కోరారు.

Scroll to Top